కోడలు పిల్ల ని ఫాలో అవుతున్న నాగార్జున !

-

టాలీవుడ్ కింగ్ నాగార్జున వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ‘సోగ్గాడు’ సినిమా తర్వాత చేసిన ప్రతి సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. తన కెరియర్ లో అదిరిపోయే బ్లాక్ బస్టర్ సినిమా ‘మన్మధుడు’ నీ సీక్వెల్ చేసినా కానీ విజయం వరించలేదు. ప్రస్తుతం కొత్త డైరెక్టర్ తో నాగార్జున సినిమా చేస్తున్నారు. అయితే చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో మరోపక్క కోడలు అక్కినేని సమంత పరిస్థితి కూడా ఇదే విధంగా ఉండటంతో నాగార్జున కోడలు పిల్ల ని ఫాలో అవుతూ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. Image result for nagarjuna samantha

విషయంలోకి వెళితే అక్కినేని ఇంటికి కోడలు అయ్యాక మొదటి లో సినిమాలు చేసి వరుస విజయాలు అందుకున్న ఇటీవల చేస్తున్న సినిమాలు పరాజయం పాలవడం స్టార్ట్ అయ్యాయి. తాజాగా చేసిన జాను సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో అవకాశాలు తగ్గడంతో ఇప్పటికే ది ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ చేస్తున్న సమంత తాజగా ఓ రియాలిటీ షో కి వ్యాఖ్యాతగా చేసేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఓ రియాల్టీ షో యాంకర్ అంటే ముందుగా గుర్తొచ్చేది నాగార్జున చేసిన బిగ్ బాస్ మరియు మీలో ఎవరు కోటీశ్వరుడు వంటివి.

 

కానీ ఇక్కడ విషయం ఏమిటంటే సమంత రియాలిటీ షో చేసేది టివి ఛానల్ లో కాదు .. ఓ టిటి ప్లాట్ ఫార్మ్ పై !! ఎస్ .. తాజగా ఈ ఓ టిటి వేదికగా ఓ రియాల్టీ షో ని ప్లాన్ చేస్తున్నారట. అది అచ్చంగా మీలో ఎవరు కోటీశ్వరుడు తరహాలో ఉంటుందని, ఆ షో కోసం హోస్ట్ గా సమంత తో సంప్రదింపులు జరిపితే ఓకే చెప్పిందట. దీంతో నాగార్జున కూడా ఇక పూర్తిగా సినిమాలు ఆపేసి కోడలు పిల్ల సమంతా మాదిరిగా OTT ప్లాట్ఫార్మ్ మీదకి వెళ్ళాలి అనుకుంటున్నాడు అని టాక్.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news