నువ్వు నిజంగా మన్మథుడివే నాగ్… మన్మథుడు2 మేకింగ్ స్టిల్స్

-

నాగార్జున మన్మథుడు 2 సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నారు. మన్మథుడు సినిమాకు ఇది సీక్వెల్. ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతోంది.

నాగార్జున.. అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగానే కాకుండా.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నారు. ఆయన ఖాతాలో ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ ఉన్నాయి. మనం ఆయన గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది ఫిట్ నెస్ గురించి. 20 ఏళ్ల కింద నాగార్జున ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఫిట్ నెస్ ను మెయిన్ టేన్ చేస్తున్నారు నాగ్. అందుకే కాబోలు యువతులైతే నాగ్ అంటే పడి చచ్చిపోతారు. గ్రీకు వీరుడు నా రాకుమారుడు… అంటూ యువతులు ఆయన్ను చూసి మురిసిపోతుంటారు. అంత ఫిట్ గా ఉంటారు నాగ్.

Nagarjuna latest movie manmadhudu 2 making stills

ఇక.. అసలు విషయానికి వస్తే.. నాగార్జున మన్మథుడు 2 సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నారు. మన్మథుడు సినిమాకు ఇది సీక్వెల్. ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతోంది. ఈసందర్భంగా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్… నాగార్జునకు సంబంధించిన మేకింగ్ స్టిల్స్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

బ్లాక్ బనియన్ వేసుకొని కండలు తిరిగిన యోధుడిలా కనిపిస్తూ… కసరత్తులు చేస్తున్న ఫోటోలు అవి. ఈ సీన్ మాత్రం కింగ్ ఫ్యాన్స్ మీకోసమే అంటూ రాహుల్ ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇక.. నాగ్ అభిమానులు ఊరుకుంటారా? సార్.. మీరు ఇంకా 30 ఏజ్ లోనే ఉన్నారు. మన్మథుడులో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు.. అంటూ నెటిజన్లు నాగ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news