జెర్సీ ఫస్ట్ రివ్యూ.. నాని నటనకు ఫిదా అవ్వాల్సిందే..!

-

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా జెర్సీ. క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగేలా చేసింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా పక్కా హిట్టు అని చెప్పిన నాని కాన్ఫిడెన్స్ చూసి చాలా మంది కామెంట్స్ చేసినా ఫైనల్  గా జెర్సీ ఓవర్సీస్ టాక్ చూస్తే నాని చెప్పింది నిజమే అనిపిస్తుంది.

నాచురల్ స్టార్ నటన, గౌతం తిన్ననూరి డైరక్షన్ ఈ రెండు సినిమాకు హైలెట్ అంశాలని తెలుస్తుంది. కథ, కథనాలు కూడా చాలా ఎమోషనల్ గా సాగించారట. అనిరుధ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యిందని అంటున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ కూడా సినిమాలో మంచి నటన కనబరిచిందని తెలుస్తుంది. సినిమాలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ మాత్రం అదిరిపోతాయట. మొత్తానికి నాని లాస్ట్ ఇయర్ కాస్త వెనుకపడ్డా జెర్సీతో మళ్లీ ట్రాక్ ఎక్కాడని చెప్పొచ్చు.

  పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేయండి

 ‘జెర్సీ’ రివ్యూ & రేటింగ్ 

Read more RELATED
Recommended to you

Latest news