ఈవీఎంలను హాక్ చేయడం అసాధ్యం: ఐటీ నిపుణుడు

-

నేను ఎంబెడెడ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా క్రిప్టాలజీ, ఎన్ క్రిప్టింగ్ టెక్నాలజీ మీద గత 15 ఏళ్లుగా పని చేస్తున్నాను. ఏపీ ప్రభుత్వ పెద్దలు ఆరోపణలు చేస్తున్నట్టుగా ఒక ఈవీఎంను టాంపర్ చేయాలంటే దానికి హార్డ్ వేర్, కమ్యూనికేషన్ రేడియోస్, సపోర్టింగ్ సాఫ్ట్ వేర్ కావాలి.

ఈవీఎంలను హాక్ చేయడం లేదా టాంపరింగ్ చేయడం అసాధ్యమైన పని అని ఐటీ నిపుణుడు సందీప్ రెడ్డి స్పష్టం చేశారు. ఈవీఎంలు హాక్ చేయలేనివిధంగా, టాంపరింగ్ చేయలేని విధంగా తయారు చేయబడతాయని ఆయన వెల్లడించారు. కావాలని ఈవీఎంలపై కొందరు దుష్ప్రచారాన్ని చేస్తున్నురని… ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను డీకోడ్ చేయడం అసాధ్యమైన పని అన్నారు.

It is impossible to hack EVM says IT specialist

ఈవీఎంను టాంపరింగ్ చేయాలంటే దాంట్లో ఏదైనా డివైజ్ డ్రైవర్ ను ఇన్ స్టాల్ చేయాలి. కానీ.. ప్రస్తుతం ఉన్న ఈవీఎంలలో ఏ డివైజ్ డ్రైవర్ ను కూడా ఇన్ స్టాల్ చేయలేరన్నారు. ఈవీఎంలను ఎన్నికల సంఘం అన్ని రకాలుగా పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఈ రకం టెస్ట్ లు చేస్తుందన్నారు.

నేను ఎంబెడెడ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా క్రిప్టాలజీ, ఎన్ క్రిప్టింగ్ టెక్నాలజీ మీద గత 15 ఏళ్లుగా పని చేస్తున్నాను. ఏపీ ప్రభుత్వ పెద్దలు ఆరోపణలు చేస్తున్నట్టుగా ఒక ఈవీఎంను టాంపర్ చేయాలంటే దానికి హార్డ్ వేర్, కమ్యూనికేషన్ రేడియోస్, సపోర్టింగ్ సాఫ్ట్ వేర్ కావాలి. పోనీ.. నెట్ వర్క్ వీడియోలతో ఈవీఎంను బిల్డ్ చేయాలన్నా కూడా అది చాలా ఖరీదయిన పని. ప్రభుత్వ పెద్దలు కావాలనే ఈవీఎంలపై లేనిపోని తప్పులు ప్రచారాలు చేస్తున్నారు. ఏపీ ప్రజలు వాటిని నమ్మొద్దు. ఏపీ ప్రజలకు నిజం తెలియాలని చెప్పి నేను మీడియా ముందుకు రావడం జరిగింది. ఈవీఎంలను టాంపర్ చేయడం అసాధ్యమైన పని… అని ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news