హిట్ కోసం నాగార్జున కొత్త ప్రయత్నాలు సక్సెస్ అయ్యేనా.!

అక్కినేని నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా దసరా పండుగ కు వచ్చి బోల్తా కొట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అనవసర విషయాలు వదిలి సినిమాల మీద ద్యాస పెట్టాలని కోరుతున్నారు.ప్రస్తుతం గతంలో ఓకే తరం హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున అందరూ ఇప్పటికి కూడా తమ దైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. వీరిలో నాగార్జున తప్ప మిగిలిన అందరూ సక్సెస్ ట్రాక్ లో వున్నారు.

నాగార్జున మాత్రం ఇప్పటికీ ఫ్లాప్ ల నుండి బయటకి రావటం లేదు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ తరువాత నాగ్ కు మంచి హిట్ రాలేదు. ఎంతగా కష్టపడుతున్నా గాని   సక్సెస్ అందుకోలేకపోతున్నారు.దీంతో నాగార్జున అలోచనలో పడ్డారు. ఆయన అభిమానుల మాత్రం గేరు మార్చాల్సిన అవసరం వుందని కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఈ నలుగురు హీరోల మధ్య మంచి పోటీ వుండేది. ఒకరిని మించి మరొకరి సినిమా హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఎప్పుడూ కోరుతూ వుంటారు.

ఇక తాను పాపులర్‌ రైటర్‌ ప్రసన్న కుమార్‌ బెజవాడ ను ఆయన నమ్ముకున్నట్లుగా తెలుస్తోంది.  ప్రసన్న కుమార్ దర్శకుడిగా మారి నాగార్జున హీరోగా సినిమా చేయబోతున్నారు అనేది కన్ఫమ్‌ అయ్యింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే అల్లరి నరేష్‌ కూడా నటించబోతున్నారని సమాచారం. కమర్షియల్‌ అంశాలను, కామెడీ మేళవింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కబోతుందని సమాచారం.