ఈటలకు రాజకీయంగా జన్మనిచ్చించి కేసీఆర్‌ : మంత్రి కేటీఆర్‌

హుజూరాబాద్ కు ఈటలను పరిచయం చేసింది కేసీఆరేనని, తండ్రి లాంటి కేసీఆర్ ను పట్టుకుని ఈటల విమర్శిస్తున్నాడని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై ధ్వజమెత్తారు. రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నాడని అన్నారు. ఎవరి పాలన దేశానికి అరిష్టదాయకమో ఈటలకు తెలియదా? అని ప్రశ్నించారు. ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ చెప్పారు… ఆ రూ.15 లక్షలు ఎవరి ఖాతాలో పడ్డాయి? అని కేటీఆర్ నిలదీశారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పైనా కేటీఆర్ ధ్వజమెత్తారు.

“ఢిల్లీలో 700 మంది రైతులను ఎండలో, వానలో, చలిలో కాల్చుకుతిన్నారు… రైతులు చనిపోయినా కానీ కనికరించని వ్యక్తి నరేంద్ర మోదీ. మోదీ ఎవరికి దేవుడు? ఏం చేశాడు నరేంద్ర మోదీ? 30 ఏళ్లలోనే అత్యధిక ద్రవ్యోల్బణం, 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయాయి. మునుపెన్నడూ లేనంతగా పెట్రోల్, గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. రూపాయి పాతాళానికి పడిపోతే, అప్పులు ఆకాశాన్నంటుతున్నాయి. ఇందుకేనా నరేంద్ర మోదీ దేవుడు? ఇంకా ఆయన అంటాడు… అమిత్ షాను చూస్తే టచ్ చేయబుద్ధవుతుందట! ఇదేం దిక్కుమాలిన టచ్ నాకు అర్థం కాదు. ఇందుకా నిన్ను ఎంపీని చేసింది? ఎంత చిల్లర మాటలు! తెల్లారిలేచింది మొదలు… మైక్ దొరికితే చాలు… మసీదులు తవ్వుదాం… శవం వెళితే మీది శివం వెళితే మాది అంటాడు… ఇందుకా నిన్ను ఎంపీని చేసింది.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?