అనుష్క, పాయల్ ఇద్దరితో నాగార్జున రొమాన్స్..!

-

కింగ్ నాగార్జున మళ్లీ వరుస సినిమాలు చేసేలా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. దేవదాస్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో త్వరలో ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు నాగ్. ఆల్రెడీ సోగ్గాడే చిన్ని నాయనా సీక్వల్ గా బంగార్రాజు సినిమా స్క్రిప్ట్ ఫైనల్ కాగా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సినిమాతో పాటుగా నాగార్జున కెరియర్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న మన్మధుడు-2 సినిమాను కూడా త్వరలోనే మొదలు పెట్టనున్నాడు.

ఇక ఈ సినిమాను రాహుల్ రవింద్రన్ డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుండగా సినిమాలో అనుష్క, పాయల్ రాజ్ పుత్ ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారని తెలుస్తుంది. నాగార్జున అనుష్క రొమాన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక లేటెస్ట్ హాట్ బ్యూటీ పాయల్ కూడా నాగ్ తో రొమాన్స్ కు రెడీ అవుతుంది. ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య మన మన్మధుడు చేసే హంగామా ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news