Trailers Review : ఏది నిజం…! ఎన్.టి.ఆర్ మహానాయకుడు వర్సెస్ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్.

-

నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే తెగింపు ఉన్న వ్యక్తి ఆర్జివి. అలాంటి వ్యక్తి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అంటూ ఓ సినిమా మొదలు పెట్టాడు. ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక ఫిబ్రవరి 22న రిలీజ్ అవుతున్న ఎన్.టి.ఆర్ మహానాయకుడు ట్రైలర్ కూడా కొద్దిసేపటి క్రితం రిలీజైంది.

ఈ రెండు ట్రైలర్స్ విభిన్నంగా ఉన్నాయి. తను పెట్టిన టైటిల్ కు న్యాయం చేస్తూ వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అంతా ఎన్.టి.ఆర్ జీవితంలో అసలేం జరిగిందో అదే చెప్పడానికి ప్రయత్నించాడు. ఇక మహానాయకుడు ట్రైలర్ చూస్తే ఎన్.టి.ఆర్ గెలుపుని మాత్రమే చూపించారు.. కొన్ని వివాదాలు చూపించారనుకోండి.. చివరి దశలో ఆయన జీవిత భాగాన్ని స్కిప్ చేసినట్టు తెలుస్తుంది. వర్మ డైరెక్ట్ గా నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు వాడిని నమ్మడమే అనే డైలాగ్ పెట్టాడు. అది ఎవరిని ఉద్దేశించి పెట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే ఎన్.టి.ఆర్ మహానాయకుడు లో అలాంటి ఎపిసోడ్స్ ఏమి లేవు. ముందునుండి చెబుతున్నట్టుగా బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ అంతా చంద్రబాబు కనుసన్నల్లో ఉందని తెలుస్తుంది. మరి సినిమా ట్రైలర్స్ ఇలా పోటీ పడుతుండగా సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news