“ఇంతకీ ఎవడాడు?” నాగార్జున “ది ఘోస్ట్” ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ” ది ఘోోస్ట్ ” టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తయ్యాయి. అయితే.. ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌ అయ్యింది. ఈ ట్రైలర్ ని నాగార్జున తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. గతంలో విడుదల చేసిన ట్రైలర్ తరహాలోనే ఈ లేటెస్ట్ ట్రైలర్ కూడా భారీ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకునేలా ఉంది.

ట్రైలర్ మొదలవ్వగానే ” ఇంతకీ ఎవడాడు” అనే డైలాగ్ తో నాగార్జున ని ” ది ఘోస్ట్” గా ఇంట్రడ్యూస్ చేశారు. ట్రైలర్ అధ్యంతం యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది.  కాగా ఈ చిత్రానికి ది ఘోస్ట్ అనే టైటిల్ పెట్టి మొదటినుండే క్యూరియాసిటీని పెంచేసింది చిత్ర బృందం. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన యాక్షన్ ప్రోమో,ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఈ మూవీలో నాగార్జున ఓ ఇంటర్పోల్ ఆఫీసర్ గా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

ఈ చిత్రంలో అందాల భామ సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గా ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమాలోని యాక్షన్ దృశ్యాలు హాలీవుడ్ చిత్రాలను తలపించేలా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.