బాబోయ్..ఏంట్రా ఇది..ఇలా చంపుతున్నారేంటిరా బాబు..

-

ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో..అయితే ఒకప్పుడు కొన్ని ప్లెవర్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి..కాని ఇప్పుడు ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం ఇప్పుడు ఎన్నో రకాల ఫ్లేవర్స్ అందుబాటులోకి తీసుకొని వచ్చారు.బట్టర్‌ స్కాచ్‌, స్ట్రాబెర్రీ, కోన్‌, చాక్లెట్‌.. ఇలా ఎన్నెన్నో వెరైటీలుంటాయి. మరి మీరు ఎప్పుడైనా బటర్ చికెన్ ఐస్ క్రీం తిన్నారా..ఈ పేరు వినగానే డోకు వస్తుంది కదా..ఆ దరిద్రం కూడా ఒకటి ఉందట..


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి. ఈ డెడ్లీ కాంబినేషన్ రెసిపీ చూసి జనాలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వాంతులు వస్తున్నాయంటూ ఈ ఘనకార్యానికి కారణమైన వాడిపై మండిపడుతున్నారు కొందరు.వైరల్ అవుతున్న వీడియోలో, ఒక చెఫ్ బటర్‌ చికెన్‌ ఐస్‌క్రీం ఎలా తయారుచేస్తున్నాడో మనం చూడవచ్చు. ముందుగా ఒక కప్పులో బటర్ చికెన్ ప్యూరీని అందిస్తాడు.

ఆతరువాత అదనపు రుచి, మసాలా టేస్ట్‌ వచ్చేందుక దానిపై పుదీనా చట్నీ టాప్‌ చేస్తాడు. ఢిల్లీలోని అలోఫ్ట్ ఏరోసిటీలో ఓ స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారి వింతైన వంటకం తయారుచేసి కస్టమర్‌కు అందించాడు.ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆహార ప్రియులు, ముఖ్యంగా ఐస్ క్రీం లవర్లు ఈ రెసిపీ చూసి షాక్ అవుతున్నారు. ‘ఈ డెడ్లీ కాంబినేషన్‌ ఎంట్రా బాబూ..ఇలా చంపుతున్నారేంటిరా నాయనా అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది..ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి ఫుడ్ వీడియోలు లెక్కకు మించి వైరల్ అవుతున్నాయి.. అందులో కొన్ని జనాలను ఆకర్షిస్తె, మరి కొన్ని మాత్రం కోపాన్ని తెప్పిస్తున్నాయి..ఈ వెరైటీ వీడియోను మీరు ఒకసారి చూడండి.

 

Read more RELATED
Recommended to you

Latest news