యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రస్తుతం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలతో సుదీర్ఘకాలంగా ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఈమధ్య కాలంలో రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు. ఇలా కెరియర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే మూడు రోజుల క్రితమే తన ప్రేయసిని నాగశౌర్య కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతని గురించి.. ఆయన వివాహం చేసుకున్న అమ్మాయి ఆస్తుల గురించి ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ హ్యాండ్సమ్ యంగ్ హీరో నాగ శౌర్య బెంగళూరు కి చెందిన అనూష శెట్టిని చాలా రోజుల క్రితమే ప్రేమించాడు. దీంతో వీళ్ళిద్దరూ పెద్దలను ఒప్పించి నవంబర్ 20న వివాహం చేసుకున్నారు. ముందు రోజు కాక్ టైల్ పార్టీని కూడా నిర్వహించారు. ఇందులోనే నాగశౌర్య అనూషా కు ఉంగరం తొడిగాడు.. త్వరలోనే నాగశౌర్య హైదరాబాదులో రిసెప్షన్ నిర్వహించాలనుకుంటున్నట్లు సమాచారం. టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య వివాహం చేసుకున్న తర్వాత అతడు తీసుకున్న కానుకల గురించి ప్రస్తుతం ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యంగ్ హీరోకి అంత డబ్బు ఇచ్చారు.. ఇంత డబ్బు ఇచ్చారు అంటూ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇదే టాపిక్ ఇప్పుడు ట్రెండీ టాపిక్ గా మారిపోయింది.
హీరో నాగ శౌర్య పెళ్లి చేసుకున్న అనూష శెట్టి బ్యాగ్రౌండ్ గురించి ఇప్పటికే ప్రతి ఒక్కరికి తెలుసు. న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేసిన ఈమె సొంత కంపెనీ పెట్టుకొని ఇంటీరియర్ డిజైనర్ గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈమె పేరిట సుమారుగా రూ.80 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని సమాచారం. అంతేకాదు తన పేరిట ఉన్న ఆస్తుల్లో సగభాగానికి పైగా భర్త నాగశౌర్య పేరిట రాసేసిందని కూడా సమాచారం. ఇలా మొత్తంగా రూ.50 కోట్ల వరకు నాగశౌర్య కట్నం కింద దక్కించుకున్నట్లు సమాచారం.