నంద‌మూరి హీరోల క్లాష్ ఎందుకు…

-

నంద‌మూరి ఫ్యామిలీ హీరో సినిమా మ‌రో హీరో సినిమాకు పోటీగా వ‌స్తుందంటే నంద‌మూరి ఫ్యామిలీ హీరోల ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. అలాంటిది నంద‌మూరి ఫ్యామిలీ హీరోలే త‌మ సినిమాల‌తో త‌ల‌ప‌డుతున్నారంటే ఇక ఆ పోటీ మామూలుగా ఉండ‌దు. సాధార‌ణంగా నంద‌మూరి ఫ్యామిలీ హీరోలు తమ సినిమాల మద్య క్లాష్‌లు లేకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు తమ సినిమాల విడుదల విషయంలో జాగ్రత్తలు పడుతూ ఉంటారు.


అయితే 2015 సంక్రాంతికి బాల‌య్య డిక్టేట‌ర్‌, ఎన్టీఆర్ నాన్న‌కుప్రేమ‌తో ఒకేసారి థియేట‌ర్ల‌లోకి దిగాయి. అయితే వ‌చ్చే సంక్రాంతికి కూడా నంద‌మూరి హీరోల సినిమాల‌తో సంక్రాంతి పోరు హీటెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే సంక్రాంతి బ‌రిలో మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు, బ‌న్నీ అల వైకుంఠ‌పురంలో డేట్లు లాక్ చేసుకున్నాయి.

ఇక ఇప్పుడు నంద‌మూరి హీరోల సినిమాలు కూడా సంక్రాంతి రేసులో నిల‌వ‌బోతున్నాయి. వేగేశ్న స‌తీష్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ళ్యాణ్‌రామ్ న‌టిస్తోన్న “ఎంత‌మంచి వాడ‌వురా” సంక్రాంతికి డేట్ లాక్ చేసుకుంది. ఈ విష‌యాన్ని యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇక బాల‌య్య నటిస్తున్న ఆయన 105వ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జైసింహా సంక్రాంతికే వ‌చ్చి హిట్ అయ్యింది. దీంతో ఈ కాంబినేష‌న్లో వ‌స్తోన్న ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఇక స‌తీష్ వేగేశ్న‌కు సంక్రాంతి సెంటిమెంట్‌ ఉంది. దీంతో ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి రేసులోనే ఉంటే బాబాయ్ వ‌ర్సెస్ అబ్బాయ్ పోరులో ఎవ‌రిది పైచేయి సాధిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌ర‌మే.

Read more RELATED
Recommended to you

Latest news