ఉత్తమ విలన్​గా తారకరత్నకు నంది అవార్డు..ఏ సినిమాకో తెలుసా..?

-

నందమూరి తారకరత్న గత 23 రోజులుగా బెంగళూరులోని హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించాడు. ఆయన మరణంతో నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తారకరత్న కన్నుమూసిన నేపథ్యంలో సినీ ప్రముఖులంతా సంతాపం ప్రకటిస్తున్నారు.

20ఏళ్లకే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తారక్.. 2002లో ‘ఒకటో నెంబర్‌కుర్రాడు’ సినిమాతో హీరోగా తెరంగ్రేటం చేశాడు. ఆ తర్వాత ‘తారక్‌’, ‘భద్రాద్రిరాముడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా కంటే తారకరత్నకు విలన్‌గానే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అమరావతి’ సినిమా తారకరత్నకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఈ సినిమాలో తారకరత్న నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్​లో నటించాడు. ఇందులో తారకరత్న నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తారక్ పర్ఫామెన్స్​కు ఏకంగా నంది అవార్డు వచ్చింది. ఉత్తమ విలన్​గా తారక్ అమరావతి సినిమాకు నంది అవార్డు అందుకున్నాడు. చివరగా తారకరత్న అగ్ర దర్శకుడు క్రిష్ జాగర్లమూడి క్రియేట్‌ చేసిన ‘9అవర్స్‌’ వెబ్‌ సిరీస్‌లో నటించాడు. అంతకుముందు ‘సారధి’ అనే సినిమా చేశాడు. అదే తారకరత్న చివరి చిత్రం.

Read more RELATED
Recommended to you

Latest news