రేపటి నుంచి హాట్ హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు..

-

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు పది రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన బడ్జెట్‌ సమావేశాలు హాట్‌ హాట్‌గా సాగిన విషయం తెలిసిందే. ఈసారి పరిస్థితి మరింత వాడి…వేడిగా ఉండే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా. ఈ సెషన్ లో 20 ప్రధానాంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలుత దిశ హత్యోదంతంపై చర్చ అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమవుతుంది.

పలు కీలక అంశాలను చర్చకు ఉంచడంతోపాటు మూడు నుంచి ఐదు బిల్లులను సభ ఆమోదానికి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పాఠశాల విద్యలో ఆంగ్ల మాధ్యమం, తెలుగు సబ్జెక్టు తప్పనిసరి చేయడం, ప్రభుత్వ పనుల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్‌, నామినేటెడ్‌ పదవులు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాపై గట్టిగా నిలదీసేందుకు విపక్ష టీడీపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news