రిలీజ్ కు ముందే సంచలనం సృష్టించిన నాని దసరా మూవీ.. విషయం ఏంటంటే..

తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాని. నేచురల్ స్టార్ గా గుర్తింపు పొంది వైవిధ్యమైన కథలతో ముందుకు దూసుకుపోతున్నాడుమ ఇప్పటికే కెరియర్ లో ఎన్నో హిట్ చిత్రాలు నటించిన నాని తాజాగా దసరా చిత్రంలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. కాగా ఈ సినిమా బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న స్థాయి కంటే ఎక్కువ జరగటం ప్రస్తుతం వైరల్ గా మారింది..

Nani's Dasara Non-Theatrical Rights Sold For A Record Price | Dasara ...

నాచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. సంతోష్ నారాయణ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 30 వ తారీఖున విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదలవుతుండగా హిందీలో కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతుంది చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన నానీ లుక్, టీజర్ అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమా బిజినెస్ అనుకున్న దాని కన్నా ఎక్కువ మొత్తంలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒక్క తెలుగు స్టేట్స్ లోనే 50 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని సమాచారం.

ఈ సినిమాలోని నాని లుక్ చాలా రఫ్ గా ఉండడంతో ఫాన్స్, ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నానికి జోడిగా కీర్తి సురేష్ నటిస్తుండగా మరో కీలకమైన పాత్రలో సముద్ర ఖని కూడా నటిస్తున్నారు. కాగా ప్రేక్షకుల్లో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యకాలంలో నాని నటించిన సినిమాలు అనుకున్నంత స్ధాయిలో లో ఆడక పోవడం వల్ల ఫాన్స్, ప్రేక్షకులు ఈ సినిమాతో నాని మంచి విజయాన్ని అందుకొని మరొకసారి తన స్టామినా నిరూపించుకుంటాడని భావిస్తున్నారు.. మరి ఈ సినిమా ఎంత విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మార్చి 30 వరకు ఆగాల్సిందే.