న‌లుగురు హీరోయిన్ల‌తో నాని ప్ర‌యోగం.. కాక‌పోతే హీరోగా కాదు..!

-

నేచుర‌ల్ స్టార్ నానికి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న చేసిన సినిమాలు మినిమ‌మ్ గ్యారంటీ అనేవిధంగా ఉండేలా చూసుకుంటారు. ఇక ఆయ‌న న‌ట‌న గురించిఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. ఇక ఆయ‌న హీరోగానే కాకుండా ఇప్పుడు నిర్మాత‌గా కూడా నాని రాణిస్తున్నారు. కమర్షియల్ గా వ‌ద్ద‌నుకుని కేవ‌లం కంటెంట్ ఉన్న క‌థ‌ల‌కే ఓకే చెబుతున్నాడు.

నాని

ఇక ప్ర‌స్తుతం ఆయ‌న త‌న అక్క‌ను డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం చేస్తూ మీట్ క్యూట్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న నిర్మించిన సినిమాల‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అ సినిమా ఎంత బాగా గుర్తింపు తెచ్చుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఇప్పుడు కూడా అలాంటి క‌థ‌తోనే వ‌స్తున్నాడు.

ఇక మీట్ క్యూట్‌లో సత్యరాజ్ మెయిన్ రోల్ చేస్తున్నారు. అయితే స‌త్య‌రాజ్‌కు క‌నెక్ట్ ఉండే న‌లుగురు హీరోయిన్లు ఇందులో న‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నలుగురిలో ఇద్ద‌రిని పాత‌వారిని తీసుకుని మిగ‌తా ఇద్ద‌రిని కొత్త వారికి ఛాన్ష్ ఇవ్వాల‌ని నాని భావిస్తున్నారంట‌. కాగా ఈ మూవీ టీమ్ కాజల్ ను మాట్లాడించ‌గా.. ఆమె కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇంకో పాత్ర‌లో నివేదా థామస్ ను తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ హీరోయిన్ల విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చే చాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news