`ట‌క్ జ‌గ‌దీష్`టీమ్‌లో క‌రోనా అల‌జ‌డి?

 

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వి`. థియేట‌ర్స్ రీఓపెన్ కాక‌పోవ‌డంతో ఈ చిత్రాన్ని డిజిట‌ల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ త‌రువాత నాని త‌న నెక్ట్స్ మూవీ ప‌నిలో ప‌డిపోయాడు. నాని న‌టిస్తున్న తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. శివ నిర్మాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `పెళ్లి చూపులు` శ్వేతావ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ మూవీ రెగ్యుల‌ర్ ఏడు నెల‌ల విరామం త‌రువాత ఈ నెల 7న హైద‌రాబాద్‌లో మొద‌లైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది రోజులు షూటింగ్ జ‌రిగింది. తాజాగా ఆదివారం నుంచి ఈ మూవీ షూటింగ్‌ని నిలిపివేశారు. కార‌ణం ఈ మూవీకి సంబంధించిన మెయిన్ టీమ్ స‌భ్యుల‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌ట‌మేన‌ని తెలిసింది. దీంతో టీమ్ షూటింగ్‌ని ఆపేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.

విష‌యం బ‌య‌టికి తెలియ‌డంతో టీమ్ మెంబ‌ర్స్ అంతా హోమ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లిపోయార‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్‌లో హీరో నానితో పాటు హీరోయిన్ రీతు వర్మ తదితరులు పాల్గొన్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెడ్డి నిర్మిస్తున్నారు.