కేక పుట్టిస్తున్న నారా రోహిత్ కొత్త లుక్.. అల్లు అర్జున్ కోసమేనా..?

-

నారా వారి కుటుంబం తరపున హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నారా రోహిత్ కొన్నాళ్లుగా సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంటున్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికి నారా రోహిత్ కి సరైన సినిమా పడలేదనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ నారా వారి హీరోకి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇదివరకు బాగా బొద్దుగా కనిపించినప్పటికీ, ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా భారీగా బరువు తగ్గాడు. అంతేకాదు ఈ సమయంలో తన బాడీని సరైన షేప్ తీసుకొచ్చేందుకు చాలా కష్టపడ్డట్టు తెలుస్తుంది. అలాగే పొడవాటి గడ్డం .. మీసాలతో తీక్షణంగా ఇట్టే ఆకట్టుకునేలా ఉన్న ఈ పిక్‌ని నారా రోహిత్‌ తన ట్విట్టర్‌ ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకోవడం విశేషం.

ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప మూవీలో ఓ కీలక పాత్ర కోసం నారా రోహిత్ ను తీసుకుంటున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. అందుకోసమే ఈ లుక్ అని టాక్. కానీ, దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. కాగా, బాణం చిత్రంతో వెండితెర కు పరిచమైన నారా రోహిత్.. ఆ తర్వాత సోలో, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద మొదలగు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.

Read more RELATED
Recommended to you

Latest news