అల్లు అర్జున్ కి నేషనల్ మీడియా బంపర్ ఆఫర్…!

-

అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. భారీగా వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అందరు హీరోల అభిమానులు ఈ సినిమాను వీక్షించారు. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ కూడా చూసారు.

దీనితో వసూళ్లు భారీగా వచ్చాయి. ఈ సినిమాకు అతను మాత్రం భారీ ప్రచారమే చేసాడు. జాతీయ మీడియాతో పాటు లోకల్ మీడియా మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతూ వచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు NDTVతో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ బన్నీ అభిమానులకు మంచి ఆఫర్ ఇచ్చింది. #AlluArjunOnNDTV హ్యాష్ ట్యాగ్‌తో బన్నీని ప్రశ్నలు అడగొచ్చని చెప్పింది ఆ సంస్థ.

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ సినిమా మొదలుపెట్టే ముందు చివరి ప్రమోషనల్ ఈవెంట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. అల వైకుంఠపురములో సినిమా తన కెరీర్‌కు ఎంతగానో సాయపడిందని.. దానికి త్రివిక్రమ్‌కు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదని అంటున్న బన్నీ, NDTV ఇంటర్వ్యూతో మరోసారి నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news