నేషనల్ రికార్డ్ సృష్టించిన బాలయ్య పవన్ ఎపిసోడ్.!

బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభాస్, గోపి చంద్ ఎపిసోడ్స్ సూపర్ గా ఆకట్టుకున్నాయి. ఇక ప్రభాస్ రెండు ఎపిసోడ్స్ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.ఇక పవన్ కల్యాణ్ ఎపిసోడ్  అంతకంటే ఎక్కువగా సంచలనం సృష్టించింది.ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చెస్తే రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ షోలో తనదైన స్టైల్ లో రాజకీయంగా, కుటుంబ పరంగా, సినిమా పరంగా ప్రశ్నలు అడగడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.ఇప్పటికే ప్రసాద్ ల్యాబ్ లో స్క్రీనింగ్ వేశారు. ఇక  విజయవాడ లో పెద్ద కటౌట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.హై రెస్పాన్స్ వల్ల పవన్ కల్యాణ్ కి సంబంధించిన ఈ ఇంటర్వ్యూను రెండు ఎపిసోడ్లుగా గా మార్చారు.  నిన్న రిలీజ్ అయిన మొదటి ఎపిసోడ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది అని ఆహా టీమ్ ప్రకటించింది.

ఈ బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ గా వచ్చిన ఎపిసోడ్ పేరుకి తగ్గట్టుగానే ఆహా లో ఫాస్టెస్ట్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసిన ఎపిసోడ్ గా నిలిచి ఆల్ టైం రికార్డు సెట్ చేసిందని ఆహా టీమ్ వారు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక ఆ పోస్ట్ లో బ్లాక్ సోక్కా ఏసాడు అంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఆనందంగా రాసుకొచ్చారు. దీనితో సోషల్ మీడియాలో బాలయ్య బాబు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక రేంజ్ లో హంగామా చేస్తున్నారు.