‘నాటు నాటు’ సాంగ్ కాపీ చేశారా.. హీరోల స్టెప్స్‌కు జనం ఫిదా..

-

 

అగ్రశ్రేణి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం రికార్డుల వేటకు బయలు దేరింది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ పిక్చర్ చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. దాదాపు మూడేళ్ల పాటు ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేశారు. కాగా, వారి ఎదురుచూపులకు తెర పడింది. సినిమా చూసి వారు సంబురపడాల్సిన సందర్భం ఆసన్నమైంది. రాజమౌళి ఆవిష్కరించిన ఆ కళాఖండాన్ని వెండితెరపైన చూసి తరించాల్సిందే. ఇకపోతే ఈ చిత్రంలో హీరోలిద్దరూ కలిసి చేసిన ‘నాటు నాటు’ సాంగ్ డ్యాన్స్ స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఈ ‘నాటు నాటు’ సాంగ్ డ్యాన్స్ స్టెప్స్ గురించి అప్పట్లో సోషల్ మీడియాలో దుమారమే రేగింది. పాట స్టెప్స్ ను పూర్తిగా ఓ ఆఫ్రికా చిత్రం నుంచి కాపీ చేశారని కొందరు కామెంట్స్ చేశారు. అలా చేయడం సరికాదంటూ రాజమౌళిని ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు కూడా. కానీ, వాటిని రాజమౌళి పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు చిత్రం విడుదలై దూసుకుపోతున్నది. రాజమౌళి గత చిత్రాలను మించిన పాజిటివ్ టాక్, రెస్పాన్స్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి వస్తుండటంతో మూవీ యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారట.

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సినిమా చూసేందుకు రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు చిత్రం చూసి సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నారు. త్వరలో మరి కొందరు సెలబ్రిటీలు చూడబోతున్నారు. రాజకీయ నాయకులు కూడా బెస్ట్ విషెస్ చెప్తూ..తాము కూడా చూస్తామని అంటున్నారు. మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ద్వారా చాలా రోజుల తర్వాత ప్రజలు మళ్లీ థియేటర్ బాట పట్టే పరిస్థితి వచ్చిందని సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news