NAYANATARA : భర్తకు నయనతార సర్‌ప్రైజ్‌ గిఫ్ట్..

-

నయనతార ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు పైనే అవుతున్నా అంతే ఇమేజ్ తో స్టార్ పొజిషన్ లో కొనసాగిస్తోంది. ఇక 2003 లో అయ్యా చిత్రం ద్వారా కథానాయకిగా ఇండస్ట్రీకి పరిచయమైన నయనతార.. ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం దక్షిణాదిలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న లేడీ సూపర్ స్టార్ సాయికి చేరుకుంది.

ఇకపోతే ఇటీవల బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నయనతార తాను ప్రేమించిన ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో విగ్నేష్ శివన్ పుట్టినరోజుకి నయనతార అతన్ని సర్ప్రైజ్ చేసింది. ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా పేరున్న బుర్జ్ కలీఫా ముందు విగ్నేష్ శివన్ బర్త్ డే ను నయనతార గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది.

పైగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక తన సతీమణి ఇచ్చిన సర్ప్రైజ్ చూసి విగ్నేష్ శివన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఈ సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు. “నా భార్య నయనతార అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చింది. తను నా బంగారం. తన నుంచి ఇది నేను ఊహించలేదు” అంటూ రాసుకుంటూ పోయాడు విగ్నేష్ శివన్.

Read more RELATED
Recommended to you

Latest news