NBK 108 : అన్న దిగిండు.. గిప్పడి సంది లెక్కలు టక్కర్

-

ఎఫ్3 తర్వాత బాలయ్యతో అనిల్ రావిపూడి ఎన్బీకె 108 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అఖండ, ఎన్బీకే 107 తర్వాత.. ముచ్చటగా మూడోసారి తమన్ ఈ సినిమాకు సంగీతం అందిచబోతున్నాడు. దాంతో మ్యూజికల్‌గా అంచనాలను పెంచేసింది 108 ప్రాజెక్ట్.

ఇక అంతకు మించి అనేలా ఇందులో బాలయ్య ఊహించని రోల్‌లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఈ సినిమాలో స్టైలిష్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నారట బాలయ్య. అందుకోసం నటసింహం లుక్ ఓ రేంజ్‌లో డిజైన్ చేసినట్టు సమాచారం.

ఇది ఇలా ఉండగా, ఈ సినిమా పూజ కార్యక్రమం ఇవాళ ఉదయం ముగిసింది. ఈ నేపథ్యంలో.. అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం. అలాగే పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. అన్న దిగిండు! గిప్పడి సంది లెక్కలు టక్కర్ అంటూ అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేయడం అందరికీ ఆసక్తిని రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news