మళ్లీ తల్లి కాబోతున్న సింగర్ సునీత?

-

టాలీవుడ్ మెలోడీ క్వీన్ అయిన గాయని సునీత..రామకృష్ణను రెండో వివాహం చేసుకున్న సంగతి అందరికీ విదితమే. మొదటి భర్తతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సునీత వారితో హ్యాపీగా ఉంటోంది. రెండో భర్తతో తాజాగా మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు వినికిడి. ఈ విషయమై సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఇన్ స్టా గ్రామ్ వేదికగా సునీత పెట్టిన పోస్టు వలన ఈ వార్తలు బాగా వైరలవుతున్నాయి. మొక్కల తోటలో తిరుగుతూ పచ్చి మామిడి కాయను అప్యాయంగా పట్టుకున్న ఫొటోను ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్టు చేసింది సింగర్ సునీత. సదరు పోస్టుకు ‘బ్లెస్‌డ్(ఆశీర్వదించబడ్డాను)’ అనే క్యాప్షన్ ఇచ్చింది. అంతే ఇక..ఆ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

గర్భంతో ఉన్న వాళ్లు సాధారణంగా పుల్లటి మామిడి, చింతకాయలను తినాలని ఆరాటపడుతారని, ఇప్పుడు గాయని సునీత కూడా కడుపుతో ఉందని, అందుకే ఈ ఫొటో షేర్ చేసిందని అంటున్నారు. గాయని సునీతకు ఈ సందర్భంగా నెటిజన్లు కొందరు కంగ్రాచులేషన్స్ చెప్తుండగా, మరి కొందరు నెటిజన్లు సునీత భర్త రామ్ వీరపనేనికి కూడా శుభాకాంక్షలు అని పోస్టులు పెడుతున్నారు.

 

https://www.instagram.com/p/CcriuVgNG90/?utm_source=ig_embed&ig_rid=b44f0854-6dd0-48ea-a462-9ca3bc09f70b

Read more RELATED
Recommended to you

Latest news