అఫీషియల్: రజనీకాంత్ సినిమా అప్‌డేట్..టైమ్ ఫిక్స్..

-

తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ 169వ సినిమా గురించి ఇటీవల సోషల్ మీడియాలో బోలెడన్ని వార్తలొచ్చాయి. ఈ చిత్రానికి స్టోరి స్వయంగా రజనీయే అందించనున్నారని, స్క్రీన్ ప్లే కే.ఎస్.రవి కుమార్ ఇస్తున్నారని, డైరెక్షన్ మాత్రమే నెల్సన్ దిలీప్ చేస్తారని వార్తలొచ్చాయి. అయితే, ఇవి అధికారికమైన వార్తలు కావు. కాగా, తాజాగా మేకర్స్ పిక్చర్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ‘తలైవర్ 169’ సినిమా అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. స్టార్ సింబల్ ఇమేజ్ పోస్టర్ ను సన్ పిక్చర్ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ లో షేర్ చేశారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్ ను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

తలపతి విజయ్ తో ‘బీస్ట్’ సినిమా తీసిన తర్వాత నెల్సన్..రజనీతో చిత్రం చేస్తున్నారు. సినీ ప్రేక్షకులకు రజనీకాంత్ చివరగా ‘అన్నాత్తె’ చిత్రంలో కనిపించారు. తెలుగులో ‘పెద్దన్న’గా విడుదలైన ఈ పిక్చర్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాగా, ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news