వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం `అమ్మరాజ్యంలో కడప బిడ్డలు` ఎట్టకేలకు విడుదలవుతుంది. ఈ సినిమా విడుదలపై సాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. తెలంగాణ హైకోర్టు విచారణ జరిపిన తర్వాత సినిమా విడుదలపై రివ్యూ కమిటీ, సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఒక పక్క హైకోర్టు ఆదేశాలు.. మరోపక్క రివ్యూ కమిటీ నిర్ణయాన్ని పరిశీలించిన సెన్సార్ బోర్డు సినిమాకు `యు/ఎ` సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో సినిమా విడుదలకు మార్గాలు సుగమమైయ్యాయి. ఈ విషయాన్ని రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
ఈ సందర్భంగా వర్మ ట్వీట్ చేశాడు. ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాను ఆపాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరికీ దుర్వార్త అంటూ.. తన చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిందని తెలిపాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రదర్శన వద్ద క్రీడా సంఘం నిరసన తెలిపింది. కులాల మధ్య అన్యోన్యతను దెబ్బ తీసి, ఘర్షణకు కారణమౌతుందని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. వర్మను దేశ బహిష్కరణ చేయాలని క్రీడా సంఘం డిమాండ్ చేసింది. కాగా, `అమ్మరాజ్యంలో కడప బిడ్డలు` సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు గురువారం విడుదల అయింది