ప్రేక్షకుల ఓటు మిలిటరీ మేజర్ కా, లేక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కా……??

-

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా అలవైకుంఠపురములో కూడా సరిగ్గా అదే సమయానికి, తరువాతి రోజైన జనవరి 12న రిలీజ్ కాబోతోంది. కొన్నాళ్ల క్రితం ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతున్నట్లు ప్రకటన రావడం జరిగింది.

అయితే మధ్యలో కొందరు ఇండస్ట్రీ పెద్దల జోక్యంతో రెండు సినిమాల నిర్మాతల మధ్య సయోధ్య కుదిరి చివరకు సరిలేరు సినిమాని ఒక రోజు ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇక రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రెండు సినిమాల మధ్య పోటీ మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు నుండి టీజర్ మరియు రెండు సాంగ్స్ బయటకు వంచి ప్రేక్షకుల నుండి మంచి స్పందన సంపాదించగా, మరో వైపు అలవైకుంఠపురములో నుండి ఇటీవల సాంగ్స్ తో పాటు నిన్న టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ రెస్పాన్స్ సంపాదించింది. అలానే రెండు సినిమాల సాంగ్స్ మరియు టీజర్స్ కు యూట్యూబ్ లో పోటా పోటీగా వ్యూస్ మరియు లైక్స్ దక్కుతున్నాయి.

 

రెండు సినిమాలు కూడా మంచి కమర్షియల్ ఎంటెర్టైనర్లుగా తెరకెక్కుతుండగా, ఆయా హీరోలు మరియు దర్శకుల కాంబినేషన్ల పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు లో మహేష్ ఒక మిలిటరీ మేజర్ గా అలానే కర్నూలు యువకుడిగా రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండగా, అల వైకుంఠపురములో బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటిస్తున్నాడు. కాగా రెండు సినిమాలు కూడా అత్యంత భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్నాయి. మరి ఈ రసవత్తర సంక్రాంతి పోరులో ఫైనల్ గా ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి…….!!

Read more RELATED
Recommended to you

Latest news