దిశ పై హత్యాచారం ఘటన పై దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పలువురు సినిమా వాళ్లు కూడా ఎవరికి వారు ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే
కొద్దిరోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ గా స్పందించారు. దిశ నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలంటూ వీడియో సాక్షిగా స్పందించారు. ఆ తర్వాత దిశ నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి పడేశారు.
ఈ క్రమంలోనే ఈ ఎన్‌కౌంటర్‌ను సపోర్ట్ చేసిన ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మరో సంచలనాత్మక చట్టం తీసుకు వచ్చారు. ఏపీలో ‘దిశా చట్టం- 2019’ పేరుతో మహిళల కోసం కఠిన చట్టాన్ని తెస్తున్నట్టు కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. మహిళలు, చిన్నారులకు లైంగీక దాడులకు గురవ్వకుండా… భద్రత కల్పించేందుకు ఈ చట్టం ఉద్దేశించారు.
జగన్ దిశ చట్టం చేసినందుకు గాను మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రకటన సాక్షిగా హర్షం వ్యక్తం చేశారు. ఈ చట్టం మహిళలు, చిన్నారుల భద్రతకు ఎంతో కీలకంగా ఉంటుందని… ఈ నిర్ణయం తీసుకున్నందుకు జగన్‌ను అభినందిస్తున్నానని తెలిపారు. బాధితులకు తక్షణ న్యాయం కోసం ఏపీలో తొలి అడుగు పడడం ఆనందంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే సీఆర్పీసీని సవరించిన జగన్ ప్రభుత్వం విచారణ సమయాన్ని 4 నెలల నుంచి 21 రోజులకు కుదించిన సంగతి తెలిసిందే.
ఇక చిన్నారులపై లైంగీక వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు వేస్తారన్న భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందని.. ఇది ఈ తరహా నేరాలోచన ఉన్న వాళ్లలో భయం కలిగించేలా ఉందని.. ఈ చట్టం చాలా గొప్పగా ఉందని జగన్‌ను మొత్తానికి చిరు ఆకాశానికి ఎత్తేశారు.