ప‌వ‌న్ సినిమాలో ఫైన‌ల్ అయిన హీరోయిన్‌.. నిధి అగర్వాల్ ల‌క్‌

హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhhi Agerwal) కి మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలో బాగానే అభిమానులు ఉన్నారు. ఈమె చేసిన సినిమాలు త‌క్కువే అయినా ఆమె అందం, అభిన‌యానికి బాగానే ఫ్యాన్ బేస్ ఏర్ప‌డింది. ఇప్ప‌టికే అఖిల్ స‌ర‌స‌న మ‌జ్నులో న‌టించి మాయ చేసింది. ఆ వెంట‌నే ఇస్మార్ట్ శంక‌ర్‌లో న‌టించి ఇస్మార్ట్ బ్యూటీగా ముద్ర వేసుకుంది. అయ‌తే ఆ త‌ర్వాత ఈమె బాలీవుడ్‌కు చెక్కేసింది.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న భారీ సినిమా హరి హర వీరమల్లులో అవ‌కాశం కొట్టేసింది. ఒక్క సారిగా పెద్ద సినిమాలో ఆఫ‌ర్ రావ‌డంతో అంతా ఆమెను ల‌క్కీ అంటున్నారు ఇది తన కెరీర్ లో గొప్ప అచీవ్ మెంట్ అని నిధి చెబుతోంది.

పవన్ కళ్యాణ్ కు తాను పెద్ద ఫ్యాన్ అని, అలాంటిది ఆయ‌న సినిమాలో పాల్గొన‌డం ఆనందంగా ఉందంటూ చెప్పింది. ఇక షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు వెయిట్ చేస్తున్నట్టుగా.. తన సంతోషాన్ని వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ‌. తనకిదే బిగ్గెస్ట్ ఆఫర్ అని సంతోషం వ్యక్తం చేసింది. ఒక‌వేళ ఈ మూవీ గ‌న‌క పెద్ద హిట్ అయితే తాను స్టార్ హీరోయిన్ కావ‌డం ఖాయ‌మ‌ని ఆమె భావిస్తోంది. ఈ మూవీ.. ఇప్పటికే 50 శాతం పూర్తైందని.. మేకర్స్ ఇంతకుముందే ప్రకటించారు. ఈ కరోనా త‌ర్వాత షూటింగ్ ను మొదలుపెట్ట‌నున్నారు.