కండోమ్స్‌ వాడాలని ప్రచారం చేస్తున్న స్టార్‌ హీరోయిన్‌..నెటిజన్లు ఫైర్‌

హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) కి మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలో బాగానే అభిమానులు ఉన్నారు. ఈమె చేసిన సినిమాలు త‌క్కువే అయినా ఆమె అందం, అభిన‌యానికి బాగానే ఫ్యాన్ బేస్ ఏర్ప‌డింది. ఇప్ప‌టికే అఖిల్ స‌ర‌స‌న మ‌జ్నులో న‌టించి మాయ చేసింది. ఆ వెంట‌నే ఇస్మార్ట్ శంక‌ర్‌లో న‌టించి ఇస్మార్ట్ బ్యూటీగా ముద్ర వేసుకుంది. అయితే ఆ త‌ర్వాత ఈమె బాలీవుడ్‌కు చెక్కేసింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న భారీ సినిమా హరి హర వీరమల్లులో అవ‌కాశం కొట్టేసింది.

ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు కమర్షియల్‌ యాడ్స్‌ లలో నటిస్తోంది. అయితే.. తాజాగా ఈ అమ్మడు కండోమ్‌ ఉత్పత్తి దారుల సంస్థ అయిన డ్యూరెక్స్‌ ఇండియా సంస్థలకు చెందిన ఉత్పత్తులను ప్రమోట్‌ చేస్తూ… యాడ్స్‌ లో నటించింది.

కాగా.. ఈ యాడ్‌ లో ఈ బ్యూటీ ఏకంగా ఏకంతంగా గడుపుతున్న సమయంలో డ్యూరెక్స్‌ ఇండియా కండోమ్స్‌ మహిళలకు ఎంతగానో ఉపయోగపడతాయని అలాగే కలయికను ఎంజాయ్‌ చేసేందుకు దోహద పడతాయని ఓవర్‌ ఎక్స్‌ట్‌ మెంట్‌ తో చెప్పింది. అయితే… ఈ యాడ్‌ పై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. డబ్బులతో కోసం ఎలాంటి యాడ్స్‌ లోనైనా నటిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.