నోరా ఫతేహి గుట్టురట్టు చేసిన సుఖేష్..!

-

గత కొన్ని నెలలుగా బాగా వినిపిస్తున్న పేరు సుఖేష్ చంద్రశేఖర్.. మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్నారు. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటీమణులను ఈడీ కూడా విచారించింది.. అంతేకాదు సుఖేష్ , జాక్వెలిన్ రొమాంటిక్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిపై జాక్వెలిన్ సైతం మండిపడింది. తన గురించి మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా జాక్వెలిన్ కి సుఖేష్ అత్యంత విలాసవంతమైన విల్లా గిఫ్టుగా ఇచ్చినట్లు.. ఖరీదైన కారును బహుమతిగా అందించారు అంటూ కూడా వార్తలు వినిపించాయి.

అంతేకాదు సుఖేష్ కేసులో నోరా ఫతేహీ ని కూడా ఈడి అధికారులు విచారించారు. అయితే ఈడి ముందు నోరాఫతేహి చెప్పిన విషయాలు మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచాయి.. నోరా ఫతేహి మాట్లాడుతూ.. సుఖేష్ తో తనకు అంతగా పరిచయం లేదు అని.. ఆయన భార్య పిలిస్తే ఒకసారి ఈవెంట్ కు మాత్రమే వెళ్లాలని అక్కడే ఒక గిఫ్ట్ ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు సుఖేశ్ చెప్పిన విషయాలు విని అందరూ మరొకసారి ఆశ్చర్యపోతున్నారు.. నోరా ఫతేహి తనకు రోజుకు 10 సార్లు ఫోన్ చేసేది అని.. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే చేస్తూనే ఉండేదని సుఖేష్ చెప్పుకొచ్చాడు..

జాక్వెలిన్ అంటే జెలసీ అని.. జాక్వెలిన్ ను వదిలేసి తనతో డేటింగ్ చేయమని నోరా ఫతేహి కోరేది. మొత్తానికి నోరా మాత్రం తనకు బ్రెయిన్ వాష్ చేస్తుండేది అని సుఖేష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సుఖేష్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరొకపక్క నోరా – జాక్వేలీన్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం ఇప్పుడు మరోసారి వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news