బ్యాంక్ కస్టమర్స్ కి రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్..!

-

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ ని చెప్పింది. బ్యాంక్ కస్టమర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది బ్యాంకు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. బ్యాంక్ లాకర్ కొత్త రూల్స్ అమలు గడువును ఎక్స్టెండ్ చేస్తున్నట్టు చెప్పింది. దీనితో లాకర్ అగ్రిమెంట్స్ రెన్యూవల్ గడువు పొడిగింపు వల్ల కస్టమర్లకు ఊరట లభిస్తుంది. ఆర్‌బీఐ లాకర్ రూల్స్ 2023 జనవరి 1న ముగియాల్సి ఉంది.

ఇంకా కొంత మంది బ్యాంక్ కస్టమర్లు బ్యాంకులతో లాకర్ రెన్యూవల్ అగ్రిమెంట్లను పూర్తి చేసుకోలేదని చెప్పింది ఆర్బీఐ. ఈ కారణం గానే గడువు ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకులు నిర్ణీత తేదీ కంటే ముందుగా కస్టమ ర్ల ద్వారా లాకర్ రెన్యూవల్ అగ్రిమెంట్లపై సంతకాలు తీసుకోలేదని చెప్పింది. బ్యాంక్స్ అసోసియేషన్ రూపొందించిన మోడల్ అగ్రిమెంట్‌లో మార్పులు అవసరమని కూడా అంది.

వీటిని దృష్టి లో ఉంచుకుని ఆర్‌బీఐ లాకర్ అగ్రిమెంట్ రెన్యూవల్ రూల్స్‌ను 2023 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. 2023 ఏప్రిల్ 30 నాటికి బ్యాంకులు వారి కస్టమర్స్ కి ఈ కొత్త రూల్స్ ని చెప్పాల్సి వుంది. అలాగే 2023 జూన్ 30 నాటికి బ్యాంకులు కనీసం 50 శాతం మంది కస్టమర్ల తో రెన్యూవల్ అగ్రిమెంట్లపై సంతకాలు చేయించాల్సి ఉంటుంది.

2023 సెప్టెంబర్ 30 కల్లా బ్యాంకులు 75 శాతం కస్టమర్స్ చేత రెన్యూవల్ అగ్రిమెంట్లపై సంతకాలు చేయించుకోవాలి. 2023 డిసెంబర్ 31 కల్లా సంతకాలు చేయించాలి. 2023 జనవరి 1 కల్లా అగ్రిమెంట్ రెన్యూవల్ చేసుకోకపోవడం వల్ల లాక్ సర్వీసులు కోల్పోతే… ఆయా కస్టమర్లు ఇప్పుడు మళ్లీ ఆ సేవలు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news