సంక్రాంతికే కాదు.. సమ్మర్ కి కూడా వార్ సిద్ధం..!

-

తాజాగా సంక్రాంతి వార్ మొదలైన విషయం తెలిసిందే. సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడడానికి.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా.. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలతో పాటు కోలీవుడ్ సినిమాలైనా విజయ్ వారిసు తో పాటు అజిత్ తునివు సినిమాలు కూడా సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్నాయి. ఇలా ఈ నాలుగు పెద్ద చిత్రాలు కూడా 2023ను టార్గెట్ చేసుకొని రిలీజ్ అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే సంక్రాంతికి వార్ ఉండడమే కాదు సమ్మర్ కి కూడా వార్ సిద్ధం అవుతుంది. మరి సమ్మర్ లో కూడా బడా సినిమాలు సందడి చేయనున్నాయి.

సమ్మర్ లో టార్గెట్ చేసుకుని వస్తున్న సినిమాల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించే. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే అనౌన్స్ చేసింది. అయితే మహేష్ బాబు ఇంట వరస విషాదాలు జరగడంతో ఈ సినిమా షూటింగ్ కాస్త బ్రేక్ పడింది. అయితే ఎలా అయినా సరే అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ కూడా మొదలుపెట్టబోతున్నారు.

మరొకవైపు మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న పొన్నియన్ సెల్వన్ 2 సినిమాని కూడా ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నారు.. అలాగే మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమా కూడా సమ్మర్ లో రిలీజ్ కాబోతోంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో చేస్తున్న జైలర్ సినిమా కూడా సమ్మర్ లోనే రిలీజ్ కాబోతోంది. వీరితోపాటు రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష సినిమాలు కూడా సమ్మర్ సందర్భంగా రిలీజ్ కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news