వీర రాఘవుడి విధ్వంసం మొదలైంది

-

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కలిసి చేస్తున్న సినిమా అరవింద సమేత. ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. కంటపడ్డావా.. కనికరిస్తానేమో.. వెంటపడ్డావా అంటూ ఎన్.టి.ఆర్ చెప్పిన డైలాగ్ ఈ సినిమా రేంజ్ ఏంటో తెలుస్తుంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా టీజర్ అలా రిలీజ్ అయ్యిందో గంటలోనే అద్భుతాలను సృష్టిస్తుంది. రికార్డులను తిరగరాస్తుంది. టీజర్ రిలీజ్ అయిన గంటకే 50 వేల లైకులు.. మిలియన్ మార్క్ వ్యూయర్స్ తో అరవింద సమేత వీర రాఘవ టీజర్ రికార్డులు సృష్టిస్తుంది. కత్తి పట్టిన ఎన్.టి.ఆర్ ను చూసి చాలా రోజులవుతుంది. ఖచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ కు ఈ సినిమా పెద్ద పండుగ తెచ్చేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news