అల్లూరిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్..!

-

NTR as Alluri Seetaramaraju in #RRR movie

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం చేస్తున్న అరవింద సమేత పూర్తి కాగానే రాజమౌళి మల్టీస్టారర్ సినిమా చేస్తాడని తెలిసిందే. ఆ సినిమా కోసం వర్క్ అవుట్స్ చేసిన తారక్ సినిమాలో ఎలాంటి రోల్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ మెగా నందమూరి మల్టీస్టారర్ మళ్లీ బాహుబలి రేంజ్ సినిమాగా రాబోతుంది.

డివివి దానయ్య ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారట. నిన్న మొన్నటిదాకా ఫ్యామిలీ డ్రామా కథతో ఈ సినిమా వస్తుందని అనుకున్న ఈ సినిమా ఇప్పుడు పిరియాడికల్ సబ్జెక్ట్ అని తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో తారక్ మన్యం పులి అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. అలూరి అనగానే సూపర్ స్టార్ కృష్ణ కటౌట్ కనబడుతుంది. అప్పట్లో ఆ సినిమా చేసి పెద్ద సాహసమే చేశాడు సూపర్ స్టార్ కృష్ణ.

ఇన్నాళ్లకు తారక్ ఆ రోల్ చేసేందుకు సై అన్నాడట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందన్నది తెలియాల్సి ఉంది. అక్టోబర్ నుండి మొదలవనున్న ఈ సినిమా అఫిషియల్ స్టోరీ ఏంటన్నది మాత్రం సినిమా మొదలయ్యాకే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news