సూపర్ స్టార్ మహేష్ పై ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. అదేంటి వారిద్దరి మంచి స్నేహితులు కదా మరి వారిద్దరి ఫ్యాన్స్ ఎందుకు దెబ్బలాడుతారు అంటే. ఎన్.టి.ఆర్ రీసెంట్ రిలీజ్ అరవింద సమేత సినిమాపై మహేష్ ఎలాంటి కామెంట్ చేయలేదు దీనిపై ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు. అరవింద సమేత ఓ రోజు ముందు రాజమౌళి బర్త్ డే కు ఆయనకు గ్రీటీంగ్స్ అందించిన మహేష్ ఇంతవరకు ట్విట్టర్ లో ఎలాంటి కామెంట్ పెట్టలేదు.
మహేష్ భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్ ప్రైజ్ గెస్ట్ గా వచ్చి అలరించాడు ఎన్.టి.ఆర్. మరి తన సినిమా ప్రమోషన్ కు ఎన్.టి.ఆర్ ను వాడేసిన మహేష్ ఎన్.టి.ఆర్ బ్లాక్ బస్టర్ మూవీ అరవింద సమేత సినిమాపై ఎలాంటి కామెంట్ చేయకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. ఎంత బిజీగా ఉన్నా మహేష్ ఓ ట్వీట్ వేస్తే బాగుండేదని అంటున్నారు.
ఓ పక్క సినిమా చూసిన వెంటనే రాం చరణ్ ఎన్.టి.ఆర్ నటన గురించి సినిమా దర్శకుడు, ఆర్టిస్టుల గురించి క్లుప్తంగా చెప్పేస్తూ ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టాడు రాం చరణ్. మరి మహేష్ అరవింద సమేతపై ఎలా రెస్పాండ్ అవుతాడో అని ఘట్టమనేని ఫ్యాన్స్ తో పాటుగా ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.