ఎన్టీఆర్ హీరోయిన్ ఆత్మహత్యయత్యం చేసుకోవడానికి గల కారణం..!!

-

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి కనుమరుగైన వారు చాలా మందే ఉన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉండి ఇండస్ట్రీ ని షేర్ చేసిన వారు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. కొందరు సీనియర్ నటీమణులు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తమ సత్తా చాటుతున్నారు. మరికొంతమంది వివాహం చేసుకుని ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నారు. గతంలో టాలీవుడ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగినా గజాల ప్రతి ఒక్కరికి గుర్తు ఉండనే ఉంటుంది. అప్పటి అగ్రహీరోల సరసన అందరితో నటించింది.HERE is Missing heroine of S.S Rajamouli | Actress Gajala Latest Photo Shoot | 25CineFrames

ఇక ఆ తర్వాత మలయాళం ఇండస్ట్రీలో కూడా నటించింది. 2001వ సంవత్సరంలో నాలో ఉన్న ప్రేమ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది. ఆ తరువాత కలుసుకోవాలని, స్టూడెంట్ నెంబర్ వన్ వంటి చిత్రాలతో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక ఆ తర్వాత అల్లరి రాముడు, ఓ చిన్నదాన, మనీ మనీ మోర్ మనీ, అదృష్టం, తదితర చిత్రాలలో నటించి మంచి ప్రేక్షకుల ను సంపాదించుకుంది. దాదాపుగా 30 సినిమాలకు పైగా నటించింది. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో స్టార్ హీరోయిన్ గా వెలిగింది.Student No 1Telugu Movie Cast and Crew | Clapnumberఅయితే కెరీర్ లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలో గజాల ఆత్మహత్యాయత్నం చేయడం ద్వారా పలు వార్తల్లో నిలిచింది. 2002వ సంవత్సరంలో జూలై నెలలో ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేసినట్లుగా సమాచారం. ప్రశాంత్ కుటీర్ అనే గెస్ట్ హౌస్ లో నిద్ర మాత్రలు మింగడం ద్వారా ఇమే వార్తల్లో నిలిచింది. భరత సింహారెడ్డి సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఇక గజాల అసిస్టెంట్ ఆమెను ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలను కాపాడారు. అయితే అందుకు కారణం బాయ్ ఫ్రెండ్ తో గొడవల వల్లే ఆమె ఆత్మహత్యాయత్నం చేశారని మరికొందరు ప్రచారం చేశారు. దీంతో ఆమెకు ఆఫర్లు తగ్గిపోయాయి. ప్రస్తుతం పలు వ్యాపారాలతో చాలా బిజీగా ఉన్న ఈమె 2016వ సంవత్సరంలో పైజల్ రజా ఖాన్ అనే నటుడిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈమె రీ ఎంట్రీ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news