శక పురుషుని శత జయంతి పేరుతో ఎన్టీఆర్ జయంతిని నిర్వహిస్తాం – బాలయ్య 

-

శక పురుషుని శత జయంతి ఉత్సవాలు పేరిట ఎన్టీఆర్ శత జయంతిని కుటుంబసభ్యులంతా నిర్వహిస్తామని ప్రకటించారు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ సినీరంగంలో అడుగు పెడితే భారతీయ సినిమా తెలుగు సినిమాని తలెత్తి చూసిందని.. తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే, తెలుగు సంస్కృతి తలెత్తి నిలబడిందని వెల్లడించారు.

ఆ నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతుందని.. ఆ రోజు నుంచి 2023 మే 28 వరకు, 365 రోజుల పాటు శతపురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచెరగులా జరుగుతాయన్నారు నందమూరి బాలకృష్ణ. ఎన్నో దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు నందమూరి కుటుంబం హాజరవుతుందని.. మా కుటుంబం నుంచి నెలకొక్కరు నెలకో కార్యక్రమంలో భాగస్వాములవుతారని పేర్కొన్నారు.

అందులో భాగంగా నేను 28 వ తేదీ ఉదయం మా స్వస్థలం నిమ్మకూరు వెళ్ళి అక్కడి వేడుకలలో పాల్గొంటానని.. అక్కడి నుంచి కళల కాణాచిగా ఖ్యాతిగాంచిన తెనాలిలో జరిగే వేడుకల్ని ప్రారంభిస్తాన్నారు. 365 రోజులు.. వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు .. నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలు .. రామకృష్ణ థియేటర్ లో ప్రారంభిస్తామని చెప్పారు నందమూరి బాలకృష్ణ.
.

Read more RELATED
Recommended to you

Latest news