మహానాయకుడు వచ్చేస్తున్నాడు..!

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా క్రిష్ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ కథానాకుడు, ఎన్.టి.ఆర్ మహానాయకుడు చేస్తున్నాడు. ఆల్రెడీ కథానాయకుడు సంక్రాంతికి రిలీజైంది. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఒకే నెలలో రిలీజ్ చేయాలనుకున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ రిజల్ట్ తేడా కొట్టడంతో మహానాయకుడు విషయంలో జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే ఒకటికి రెండు సార్లు సినిమాను చూసుకుని చేర్పులు మార్పులు చేశారట.

ఇక ఫైనల్ గా ఫిబ్రవరి 22న మహానాయకుడు రిలీజ్ ఫిక్స్ చేశారు. అసలైతే ఫిబ్రవరి 7న మహానాయకుడు రిలీజ్ అనుకున్నారు కాని యాత్ర వల్ల ఆ సినిమాను వాయిదా వేసుకున్నారు. ఫైనల్ గా ఫిబ్రవరి 22న ఎన్.టి.ఆర్ మహానాయకుడు వస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మొదటి పార్ట్ నిరాశపరచగా సెకండ్ పార్ట్ మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు నందమూరి ఫ్యాన్స్.