కళ్యాణ్ రాం కోసం రంగంలోకి ఎన్.టి.ఆర్

-

నందమూరి సోదరులు ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం ల రిలేషన్ గురించి అందరికి తెలిసిందే. అన్న మంచి కోరే తమ్ముడు.. తమ్ముడు శ్రేయస్సుకోరే అన్న ఇలా ఇద్దరు ఎంతో గొప్పగా అభిమానులకు ఆదర్శప్రాయంగా ఉన్నారు. అయితే సినిమా కెరియర్ పరంగా ఎన్.టి.ఆర్ స్టార్ ఇమేజ్ తో దూసుకెళ్తుండగా కళ్యాణ్ రాం కెరియర్ మాత్రం అగమ్యగోచరంగా మారింది. సినిమాలైతే చేస్తున్నాడు కాని పెద్దగా ఫలితం చూపించడం లేదు.

అందుకే అన్న కెరియర్ మీద తమ్ముడు దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ చేసిన మూడు సినిమాలను వరుస బ్లాక్ బస్టర్స్ కొట్టిన మైత్రి మూవీ మేకర్స్ తో కళ్యాణ్ రాం సినిమా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్.టి.ఆర్ స్పెషల్ డిస్కషన్స్ జరిపాడట. తారక్ కోరిక ప్రకారమే కళ్యాణ్ రాం తో మైత్రి మూవీస్ సినిమా సెట్ అయ్యిందట. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం మూడు వరుస సూపర్ హిట్లు అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ ఈమధ్య వచ్చిన నాగ చైతన్య సవ్యసాచి, రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు రిజల్ట్ తేడా కొట్టేసింది.

మరి ఈ రెండు సినిమాల ఫలితాలు తమ తదుపరి ప్రాజెక్టుల మీద పడకుండా చూసుకుంటారో లేదో చూడాలి. కళ్యాణ్ రాం తో సినిమా మాత్రం గ్రాండ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు దర్శకుడు మిగతా విషయాలను త్వవరలో వెళ్లడిస్తారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version