బిగ్ బాస్ సీజన్ -3 ఎన్.టి.ఆర్ వచ్చేస్తున్నాడహో..!

-

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షోని తెలుగు ప్రేక్షకులకు అలవాటు చేశారు స్టార్ మా నిర్వాహకులు. బిగ్ బాస్ సీజన్ 1 యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా మొదటి సీజనే అయినా అది సూపర్ హిట్ అయ్యింది. ఇక సెకండ్ సీజన్ లో నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా కాస్త తడపడినా ఫైనల్ గా ఎలాగోలా సీజన్ హిట్ చేశాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 టైం వచ్చింది.

సీజన్ 3 కి ఎవరు హోస్ట్ గా చేస్తారు అన్న విషయంపై కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్ ఇలా ఎవరికి తోచిన పేరు వారు చెప్పేస్తున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 3కి మళ్లీ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. దాదాపు ఎన్.టి.ఆర్ కూడా సుముఖంగానే ఉన్నాడని తెలుస్తుంది.

ఎన్.టి.ఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 రాబోతుంది. ఇక కంటెస్టంట్స్ లిస్ట్ ఇప్పటికే ఆన్ లైన్ లో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. అయితే అందులో కొందరు నిజంగానే సీజన్ 3 లో ఉండే అవకాశం ఉన్నా కొందరు మాత్రం ఉండరని తెలుస్తుంది. మరి సీజన్ 3 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news