నాని నటించిన దసరా సినిమాకు మరో షాక్ తగిలింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను,కట్టుబొట్టులు కించపరిచే విధంగా సినిమాను తీసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి,ప్రధాన పాత్ర పోషించిన హీరో నాని, హీరోయిన్ కీర్తి సురేష్ మరియు చిత్ర యూనిట్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి సినిమాని వెంటనే బ్యాన్ చేయాలని ఓయూ జేఏసీ నేత శరత్ నాయక్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మచలం గారిని వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది, ముఖ్యంగా దసరా సినిమాలు తెలంగాణలోని పురుషులందరూ తాగుబోతులని, మద్యానికి బానిసలుగా చిత్రీకరించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో దసరా పండుగ నవరాత్రులు అన్ని వర్గాల ప్రజలు కలిసి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ ఆడుతూ,చాలా ఘనంగా, పవిత్రంగా జరుపుకుంటారు, అలాంటి పండుగను తెలంగాణ ప్రజలు తాగుతూ వారి కుటుంబాలను పట్టించుకోకుండా ఉంటారని సినిమాలో చాల సన్నివేశాల్లో చూపించడం జరిగింది, ఇలాంటి సినిమాలకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేముందు సరిచూడాల్సిన అవసరం ఉంది, ఇప్పటికైనా సినిమాని బ్యాన్ చేసి అన్ని థియేటర్లలో ప్రదర్శనలు ఆపకపోతే *రేపటినుండి రాష్ట్రవ్యాప్తంగా ఏ ఏ థియేటర్లలో ప్రదర్శించబడుతుందో అక్కడ సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకుంటామని OUJAC నేత శరత్ నాయక్ హెచ్చరించారు.