తల తాకట్టు పెట్టి ఎన్టీఆర్‌తో చిత్రం తీసిన పద్మనాభం..టైటిల్ కోసం వెళితే ఏం జరిగిందంటే?

-

ప్రస్తుతం సినిమాలంటే వందల కోట్ల రూపాయల బడ్జెట్‌ల మీద నడుస్తున్నాయి. ‘బాహుబలి’ ఫిల్మ్ సక్సెస్ అయిన తర్వాత ప్రొడ్యూసర్స్ వందల కోట్ల రూపాయలను పిక్చర్స్ తీసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ, ఒకప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. అలనాడు సీనియర్ ఎన్టీఆర్ సినిమాలకే బడ్జెట్ కష్టాలుండేవని అంటుంటారు. ఆ సిచ్యువేషన్స్ లో కమెడియన్ గా చక్కటి పేరు సంపాదించుకున్న పద్మనాభం తన తల తాకట్టు పెట్టి మరీ ఎన్టీఆర్ తో ఓ సినిమా తీశారు.

నటుడు పద్మనాభం తన సహ నటుడు వల్లం నర్సింహారావుతో కలిసి ‘రేఖ అండ్ మురళి ఆర్ట్స్’ పేరిట నాటక సంస్థను స్థాపించాడు. వీరి తొలి నాటకం ‘శాంతి నివాసం’. ఈయన ఆ తర్వాత కాలంలో ఓ సినిమా చేశారు. దీనికి స్టోరిని వేటూరి చెప్పారు.

డైరెక్టర్ ఎస్పీ కోదండపాణి, నటుడు పద్మనాభం రూమ్ మేట్స్ కాగా, వీరిరువురికి వేటూరి స్టోరి వినిపించారు. అందులో కథానాయిక ద్విపాత్రాభినయం చేయాలి. అది నాటకానికి సరిపోదు. తప్పనిసరిగా చిత్రం చేయాలనుకున్నారు. తాను తీయలేనని ఎవరూ తీసినా ఓకే అని వేటూరి పద్మనాభంతో చెప్పాడు. అలా ఆ స్టోరి డైరెక్టర్ కోదండపాణి మదిలోనే ఉండిపోయింది.

ఈ క్రమంలోనే స్టోరి లైన్ బాగుందని, ధైర్యం చేసి నువ్వే చేయాలని కోదండపాణి పద్మనాభంతో అన్నాడు. అలా పద్మనాభం ఆలోచించి చివరకు చేస్తానని అన్నాడు. అనుకున్నదే తడవుగా పద్మనాభం వేటూరిని వెంట తీసుకుని వెళ్లి ఎన్టీఆర్ కు స్టోరి వినిపించారు. స్టోరి విని ఎన్టీఆర్ తన సహ నటుడు ప్రొడ్యూసర్ గా అవుతున్నాడని తెలుసుకుని సంతోషపడ్డారు. వెంటనే డేట్స్ ఇచ్చేసి ‘ఆల్ ది బెస్ట్ బ్రదర్’ అని చెప్పేశారు.

హీరోయిన్ గా సావిత్రిని అనుకుని ఆమెకు కథ చెప్పగా, ఆమె కూడా ఒప్పుకుంది. ఆమెకు అడ్వాన్స్ గా డబ్బులిస్తున్న క్రమంలో వంద రూపాయల నోటు కింద పడగా, అది తీసుకుని ఆమె ఈ పిక్చర్ వందరోజులు ఆడుతుందని అంది. అలా ఆ మూవీ హండ్రెడ్ డేస్ ఆడటం విశేషం. ఇక ఈ చిత్రానికి టైటిల్ విషయమై ‘దేవత’ అని పెడదామని అనుకున్నారు.

దర్శక నిర్మాత బీ.ఎన్.రెడ్డి అప్పటికే ‘దేవత’ పేరుతో ఓ సినిమా తీశారు. దాంతో పద్మనాభం బీ.ఎన్.రెడ్డి వద్దకు వెళ్లి అడిగారు. తన మీద గౌరవంతో వచ్చి టైటిల్ అడిగినందుకుగాను కచ్చితంగా పెట్టుకోవచ్చని బీఎన్ రెడ్డి పద్మనాభానికి సూచించారు. అలా ఎట్టకేలకు చిత్రటైటిల్ కన్ఫర్మ్ అయి ఆ తర్వాత రిలీజ్, సక్సెస్ అయింది పిక్చర్.

Read more RELATED
Recommended to you

Latest news