ఎస్పీ బాలు కోసం కేఏ పాల్ ప్రార్ధనలు !

చానాళ్ళ తర్వాత కేఏ పాల్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. కరోనా బారిన పడ్డ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంను కాపాడాలంటూ తనకు ఫోన్‌ కాల్స్ వస్తున్నాయని పాల్ చెప్పారు. ఆయన ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నానని చెప్పారు. లార్డ్ జీసెస్ తప్పకుండా ఆయన్ను రక్షిస్తారని చెప్పారు పాల్. గతంలో తాను ఎంతోమంది ప్రాణాలను కాపాడినట్లు చెప్పారు. తన ప్రార్థనలతో బాలు సైతం బయటపడతారని వీడియో విడుదల చేశారు.

ఇక చెన్నై ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై ఎంజిఎం ఆసుపత్రి తాజా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఐసీయూలో వెంటిలేటర్,ఎక్నో లైఫ్ సపోర్ట్ తో ఆయనకు చికిత్స కొనసాగుతోందని కోవిడ్ చికిత్సలో నిష్ణాతులైన యుఎస్, యూకే వైద్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ఎస్పి బాలు కు వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొంది. అలానే ఎస్పీ బాలు ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు.