నెగెటివ్ వ‌చ్చినా కోలుకోని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అస‌లేం జ‌రుగుతోంది!

క‌రోనా మ‌హ‌మ్మారి త‌న ప్ర‌తాపాన్ని మామూలుగా చూప‌ట్లేదు. ఇప్ప‌టికే దేశంలో కోట్లాది మందికి సోకింది. తెలుగు రాష్ట్రాల్లోనూ త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తోంది. ప్ర‌ముఖుల‌కు క‌రోనా సోక‌డంతో ఆందోళ‌న మొద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే చాలామంది సినీ ప్ర‌ముఖులు దీని బారిన ప‌డ్డారు. కొంద‌రు ప్రాణాలు కూడా విడిచారు. ఇదిలా ఉంటే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కొవిడ్ బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. వ‌కీల్ సాబ్ విడుద‌లైన రెండో రోజే ఆయ‌నక పాజిటివ్ గా వ‌చ్చింది.


ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నివేథా తామ‌స్‌, బండ్ల గ‌ణేశ్ కు క‌రోనా రావ‌డంతో.. టెస్టు చేయించుకున్న ప‌వ‌న్ కు పాజిట‌వ్ వ‌చ్చింది. దీంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం అయింది. అయితే తాజాగా ఆయ‌న క‌రోనా నుంచి కోలుకున్నారు. కానీ ఆరోగ్యం మాత్రం కుదుట ప‌డ‌లేద‌ని స‌మాచారం. నిత్యం డాక్ట‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న‌ప్ప‌టికీ.. పూర్తిగా కోలుకోలేద‌ని తెలుస్తోంది.

ఇప్పుడు హైదరాబాద్ శివార్లలో ఉన్న ఆయ‌న ఫామ్ హౌస్ లో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు ప‌వ‌న్‌. కాగా ఆయ‌న మామూలు ప‌రిస్థితికి వ‌చ్చే సరికి మ‌రి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఇప్పుడు ప‌రిస్థితులు కూడా బాగా ఏక‌పోవ‌డంతో మ‌రి కొన్ని రోజులు ఫామ్ హౌస్ లోనే ఉంటార‌ని తెలుస్తోంది. ఇక వ‌కీల్ సాబ్ విజ‌యం సాధించినా.. థియేట‌ర్లు మూసేయ‌డంతో.. ఓటీటీలో విడుద‌ల చేసేందుక ప్లాన్ చేస్తున్నారంట‌.