మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ ..ఏం జరిగిందో తెలుసా …?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తర్వాత నటిస్తున్న తాజా సినిమా ‘వకీల్ సాబ్’. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేయాల్సిన టాకీ పార్ట్ కంప్లీటయింది. దాంతో వకీల్ సాబ్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు మేకర్స్. వాస్తవంగా దిల్ రాజుకి ఇది భారీ సినిమా అని చెప్పాలి. అంతేకాదు బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. అందుకే ఈ సినిమా రిజల్ట్ విషయంలో తేడా రాకుండా జాగ్రత్తపడుతున్నారు దిల్ రాజు.

 

అందులో భాగంగా ‘వకీల్ సాబ్’ సినిమా నుంచి ‘మగువా మగువా’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ పాటకు అంతగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. మంచి ఫామ్ లో ఉన్న థమన్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాలోని పాటల మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే మొదటి పాటే ప్రేక్షకులకి అంతగా నచ్చలేదన్న టాక్ వినిపిస్తుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు.

అయితే ఈ పాట సూపర్ అన్న టాక్ రాకపోవడంతో పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ లో నిరాశ నెలకొంది. దాంతో కొందరు పవన్ అభిమానులు థమన్ ని ట్రోల్ చేస్తూ ఏకేస్తున్నారు. బన్నీ అల వైకుంఠపురములో సినిమాకు సామజవరగమన, బుట్ట బొమ్మ లాంటి సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చి ఇప్పుడు పవన్ సినిమా కు ఇలాంటి ఫ్లాప్ సాంగ్ ఇస్తావా.. అంటూ థమన్ ని ఏసుకుంటున్నారట. అంతేకాదు పవన్ కళ్యాణ్ కూడా ఈ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి థమన్ మీద కాస్త సీరియస్ గా ఉన్నారని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. మరి థమన్ నెక్స్ట్ సాంగ్స్ అయినా మంచి హిట్ సాంగ్స్ ఇస్తాడా లేదా మళ్ళీ ఇలాగే ఫ్యాన్స్ తో తిట్టించుకుంటాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news