తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న ప‌వ‌న్‌.. ఆ సినిమా చేయ‌డానికి కార‌ణం ఆయ‌నే!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గ్యాప్ త‌ర్వాత వ‌చ్చి వ‌రుస‌గా పెద్ద ప్రాజెక్టుల‌ను లైన్‌లో పెడుతున్నారు. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ప‌వ‌న్ అదే జోరుమీద ఇప్పుడు అయ్యప్పనుమ్ కోషియుమ్ మూవీని చేస్తున్నారు. అయితే దీన్ని రీమేక్ మూవీ తెర‌కెక్కిస్తున్నారు. దీన్ని త్రివిక్రమ్ సజెస్ట్ చేసిన త‌ర్వాతనే ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారంట‌. అయితే ఈ మూవీని చేయ‌డానికి పవన్ ఒప్పుకోవడానికి ఓ కార‌ణం ఉంది.

ఈ మూవీని సాగర్ కె చంద్ర తెర‌కెక్కిస్తున్నారు. కాగా దీంట్లో హీరో ఎక్సయిజ్ విభాగంలో పనిచేసే ఎస్ఐగా రోల్ చేయ‌నున్నారు. ఇది పవన్ జీవితానికి బాగా ద‌గ్గ‌రి సంబంధం ఉన్న క్యారెక్ట‌ర్‌. ఎందుకంటే ఆయ‌న తండ్రి కూడా ఆబ్కారీ శాఖలో పోలీస్ అధికారిగా జాబ్ చేశారు.

దీంతో తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని ప‌వ‌న్ కు ఇది బాగా న‌చ్చింద‌ని స‌మాచారం. ఈ క్యారెక్ట‌ర్ చేయడానికి కూడా త‌న తండ్రి ఆయ‌న‌కు మోటివేషన్ అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌ర్ స్టార్ కేవ‌లం పోలీస్ పాత్రలు మాత్ర‌మే చేశారు. కానీ ప్ర‌స్తుతం ఆబ్కారీ శాఖలో ఎస్సైగా చేయ‌డం ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. మొత్తానికి తండ్రి చేసిన జాబ్‌నే ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ చేయ‌బోతున్నారన్న మాట‌.