థియేటర్ మాఫియాపై పేట నిర్మాత ఫైర్..!

-

తమిళ చిత్రాల అనువాద నిర్మాత అశోక్ వళ్లభనేని ప్రస్తుతం రజిని హీరోగా కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వస్తున్న పేట సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత అశోక్ థియేటర్ మాఫియా గురించి మండిపడ్డారు. దిల్ రాజు, అల్లు అరవింద్, యువి క్రియేషన్స్ వారు థియేటర్లు తమ గుప్పిట్లో పెట్టుకుని వారు వేసిన సినిమానే ప్రేక్షకులు చూడాలన్న పంథాలో వెళ్తున్నారని మండిపడ్డారు.

కె.సి.ఆర్ ప్రభుత్వంలో నయీం ను చంపించినట్టుగా థియేటర్ మాఫియాను నాశనం చేయాలని అన్నారు అశోక్. మరి యువ నిర్మాతలో ఈ మాత్రం ఫైర్ ఉండటం కామనే అయినా బడా నిర్మాతలను మాట అంటే సరిపోద్దా ఆ తర్వాత వచ్చే పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక అసలే సంక్రాంతి ఇక్కడ పెద్ద సినిమాలు వస్తున్నాయి ఇలాంటి టైంలో సినిమా తెచ్చి థియేటర్లు దొరకడం లేదని చెప్పడం ఎంతవరకు సబబు.

రజినికాంత్ సినిమాకు థియేటర్లు దొరకడం లేదు అంటూ అశోక్ వళ్లభనేని చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. థియేటర్ మాఫియాను అంతమొందించేందుకు కె.సి.ఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అశోక్ అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news