మేషరాశి: కుటుంబంలో సంతోషం, వస్త్రలాభం, వ్యసనాలతో ఖర్చులు, చిన్నచిన్న సమస్యలు. పరిహారం శివారాధన చేయండి లేదా విబూది పెట్టుకోండి.
వఋషభరాశి:అనుకూలత తక్కువ, అందరూ మీకు విరుద్ధంగా నడుచుకుంటారు, వాదాలకు దూరంగా ఉండండి. వాహనాలతో జాగ్రత్త. పరిహారం ఆంజనేయస్వామి దేవాలయ సందర్శన లేదా శివాలయ సందర్శన లేదా పారాయణం/శ్రవణం.
మిధునరాశి: ప్రతికూలమైనరోజు, బంధుమిత్రులు, కళత్రంతో విరోధ సూచనలు, మంచి ఫలితం కోసం దుర్గాదేవి ఆరాధన చేయండి. వాదాలకు దూరంగా ఉండండి.
కర్కాటకరాశి:ఉత్సాహం, ఊహించని మార్పులు, స్త్రీ మూలకంగా కార్యజయం, దేవాలయ సందర్శన యోగం. మరింత మంచి ఫలితం కోసం ఇష్టదేవతారాధన.
సింహరాశి:మిశ్రమ ఫలితం, అధికారులతో సఖ్యత, ఖర్చులు అధికం. అమ్మవారికి ఆరాధన చేసుకోండి. గోసేవ చేస్తే మంచి ఫలితం వస్తుంది.
కన్యారాశి: కార్యజయం, తండ్రి సంబంధీక బంధువుల నుంచి సహకారం. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. మంచి ఫలితం కోసం ఇష్టదేవతారాధన చేసుకోండి.
తులరాశి:బంధుమిత్రల రాక, నూతన బంధుత్వాలకు సూచన, సంతోషం వాతావరణం మంచి ఫలితాల కోసం గురుధ్యానం, దేవాలయ సందర్శన చేయండి.
వఋశ్చికరాశి:వ్యవహార జయం, కీర్తి ప్రతిష్ఠలు, ఇబ్బందులు తీరును, అనుకూల వాతావరణం. మంచి ఫలితాల కోసం భగవంతుని ప్రార్థన చేయండి. పేదలకు సహాయం చేయండి.
ధనస్సురాశి:నూతన పరిచయాలు, ఖర్చులు, అధికారుల పరిచయం, చిన్నచిన్న సమస్యలు. పరిహారం ఆంజనేయస్వామి దండకం లేదా చాలీసా పారాయణం చేయండి.
మకరరాశి:దేవాలయ సందర్శన సూచన, ప్రయాణాలలో బడలిక, బంధుమిత్రులతో సంతోషం. శివపూజ లేదా అశ్వత్థ చెట్టుకు నమస్కారం, ప్రదక్షణం చేయండి.
కుంభరాశి: కొత్త వ్యక్తుల పరిచయం, శుభమూలక ధనవ్యయం, బంధుమిత్రల రాక, మంచి ఫలితాల కోసం ఇష్టదేవతారాధన చేయండి.
మీనరాశి:శారీరక శ్రమ, పట్టుదల, ధనలాభం, ప్రారంభించిన పనులు పూర్తి. దేవుని అనుగ్రహంతో ముందుకు వెళ్తారు. ఇష్టదేవతారాధన, పేదలకు సహాయం చేయండి.