ఎన్.టి.ఆర్ బయోపిక్.. చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్..!

-

ఓ పక్క నాగబాబు బాలకృష్ణ మీద అగ్గిమీద గుగ్గీలవుతున్న ఈ సందర్భంలో తనకు ఇలాంటివేమి పట్టింపులు లేవు అన్నట్టుగా రాం చరణ్ ప్రవర్తిస్తున్నాడు. ఈ సంక్రాంతికి వినయ విధేయ రామ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ పై తన కామెంట్ వినిపించాడు రాం చరణ్.

ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ కూడా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఉందని అన్నాడు రాం చరణ్. సంక్రాంతికి వస్తున్న మరో రెండు సినిమాలు కూడా హిట్ అవ్వాలని ఆశించారు. బోయపాటి సినిమా అంటే హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది.

ఇప్పటికే వివిఆర్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా సినిమా ఆ అంచనాలకు మించి ఉంటుందని చెబుతున్నాడు రాం చరణ్. ఇక సినిమాలో కనిపించేంత వయిలెన్స్ కాదు ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉంటుందని అది సినిమాలో సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నాడు రాం చరణ్.

Read more RELATED
Recommended to you

Latest news